ప్రత్యేక విభాగాల అధికారులతో ఎస్పీ సమీక్ష
KDP: ప్రత్యేక పోలీస్ విభాగాల అధికారులతో ఎస్పీ విశ్వనాథ్ బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫ్యాక్షన్ జోన్, DCRB, DTRB, SBI, SCST సెల్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్, కోర్ట్ మానిటరింగ్ సెల్ తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఫ్యాక్షన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశించారు.