VIDEO: శివకోటిలో వైభవంగా శంకర జయంతి ఉత్సవాలు
కోనసీమ: రాజోలు మండలం శివకోటి హిందూ సమాఖ్య ఆధ్వర్యంలో శంకర జయంతి ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గ్రామంలో పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలో శంకరాచార్య పూజ, శంకర భగవత్పాదుల వారి చరిత్ర ప్రవచనం ఘనంగా జరిగింది. అనంతరం లలితా సహస్ర పారాయణం, భజగోవింద కీర్తన ఆలాపన నిర్వహించారు. భక్తులకు స్వామివారి చరిత్ర పుస్తక వితరణ చేశారు.