'గ్రామ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టబడి ఉంది'

ADB: సోనాల మండలంలోని సాకేర గ్రామంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ ఆదివారం పర్యటించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతూ ఎంపీకి గ్రామస్తులు వినతి పత్రం అందజేయగా.. గ్రామాన్ని దశలవారీగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.