నేడు వేపూర్ రానున్న ఎంపీ డీకే అరుణ

MBNR: హన్వాడ మండలంలోని వేపూర్‌లో గురువారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారని బీజేపీ శ్రేణులు తెలిపారు. గ్రామంలోని వివిధ వార్డులలో ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ పనుల ప్రారంభోత్సవం ఉదయం ఉంటుందని తెలిపారు. ఎంపీ నిధులతో గ్రామ అభివృద్ధి పనులు జరగడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.