VIDEO: గుండ్లకమ్మ నదిలో చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి
BPT: అద్దంకి మండలంలోని మణికేశ్వరం గ్రామంలో గుండ్లకమ్మ నదిలో చేప పిల్లలను విడుదల చేసే మీనోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ముందుగా గ్రామస్తులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన చేప పిల్లలను నదిలో వదిలారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు.