కాలుష్యంపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీ

కాలుష్యంపై నిర్లక్ష్యం వద్దు: ఎంపీ

SRD: సంగారెడ్డి నుంచి బీహెచ్ఎల్ వరకు పెరిగిపోతున్న కాలుష్యంపై ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్‌లో జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షలో ఆయన మాట్లాడారు. కంకర మిషన్ల వద్ద దుమ్ము వెదజల్లుతున్నా పొల్యూషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సంగారెడ్డి కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.