ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 10:30 గంటలకు పి.గన్నవరం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు మామిడికుదురు హైస్కూల్లో డైనింగ్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరైతారని తెలిపారు.