నేడు మంత్రి పర్యటన వివరాలు

NLR: మంత్రి కొలుసు పార్థసారథి ఇవాళ వింజమూరుకు రానున్నారు. వింజమూరులోని యాదవ బజార్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరుగనున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్య క్రమంలో ఆయన పాల్గొననున్నారని జిల్లా సమాచార అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌తో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.