విజయవాడ వైద్యుడిని అభినందించిన గోవా గవర్నర్
NTR: మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం విశేషంగా కృషి చేస్తున్న ప్రముఖ మధుమేహ వైద్య నిపుణులు వేణుగోపాల్ రెడ్డికి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు అభినందనలు తెలిపారు. ఇటీవల తనకు వచ్చిన ఒక అవార్డుని గోవా గవర్నర్ చేతుల మీదుగా అందుకున్నారు. వీజీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు 50 వేల నీడనిచ్చే మొక్కలు, పండ్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేశామని వేణుగోపాల్ పేర్కొన్నారు.