వైసీపీలోకి భారీగా చేరికలు

విశాఖ: గొలుగొండ మండలం ఏఎల్ పురం మేజర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైసీపీలోకి సుమారు 100 మంది శుక్రవారం జాయిన్ అయ్యారు. ఈమేరకు గ్రామంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.