జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్
CTR: రబీ సీజన్లో పంటల సాగుకు జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటలకు అవసరమైన 2183 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డీలర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.