భూపాలపల్లిలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

BHPL: పట్టణ కేంద్రంలో సోమవారం తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇంఛార్జ్ రవి పటేల్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు రవి పటేల్ మాట్లాడుతూ.. 1650లో వరంగల్ ఖిలాశాపూర్‌లో జన్మించిన పాపన్న గౌడ్ మొగల్ అణిచివేతను ఎదిరించి, బహుజనుల ఐక్యత, అభివృద్ధి కోసం పోరాడిన వీరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఉన్నారు.