ఆరు బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్: ఎక్సైజ్ సీఐ

W.G: తణుకు మున్సిపాలిటీ పరిధిలో 6 మద్యం బార్లకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తణుకు ఎక్సైజ్ సీఐ సత్తి మణికంఠ రెడ్డి తెలిపారు. సోమవారం తణుకులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 26వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియలో దాఖలు చేసుకోవచ్చని చెప్పారు. ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు వస్తే లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు.