ఈ నెల 18, 19 తేదీలలో ఆర్గానిక్ మేళ

ఈ నెల 18, 19 తేదీలలో ఆర్గానిక్ మేళ

ఏలూరులో ఈ నెల 18, 19 తేదీలలో ఆర్గానిక్ మేళా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్గానిక్ మేళా ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రకృతి సాగు చేసే రైతులందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.