'వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'
KMR: పెద్దకొడప్గల్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని మంగళవారం డా.విద్య సందర్శించారు. పలు రకాల ప్రత్యేక వైద్య సేవల ద్వారా ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఆర్తోపెడిక్, గైనిక్, డెంటల్, తదితర ప్రత్యేక వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.