నిరుపయోగంగా చేపల మార్కెట్

నిరుపయోగంగా చేపల మార్కెట్

HNK: ముల్కనూర్ గ్రామంలో నిర్మించిన చేపల మార్కెట్ పూర్తిగా నిరుపయోగంగా మారింది. మార్కెట్లో కనీస సౌకర్యాలు విద్యుత్, నీటి సదుపాయం లేకపోవడంతో వాడుకలో లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేపల విక్రయాలు రోడ్లపైనే జరుగుతున్నాయి. ఈ విషయంపై అధికారులు చొరవ తీసుకుని చేపల మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.