VIDEO: శాయంపేటలో వీధి కుక్కల హత్యపై 9 మందిపై కేసు
HNK: శాయంపేట మండలం ఆరేపల్లిలో వీధి కుక్కల మృతి ఘటన కలకలం రేపింది. సుమారు 300కు పైగా వీధి కుక్కలకు విష ఆహారం పెట్టి చంపినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై జంతు సంరక్షణ, జంతు ఫౌండేషన్ ఆఫ్ ఇండియా క్రూరత్వ నివారణ మేనేజర్ గౌతమ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఆదివారం సీఐ రంజిత్ రావు తెలిపారు.