'స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు కట్టుబడి ఉండాలి'

SKLM: స్వచ్ఛ శ్రీకాకుళం సాధనతో సహా, స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో ఈవోపీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతను ప్రజల దైనందిన జీవన విధానంలో భాగం చేయాలని ఆకాంక్షించారు.