కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభం

కాలనీలో సీసీ కెమెరాల ప్రారంభం

రంగారెడ్డి: బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మొదటి డివిజన్‌లోని సాయి నగర్ కాలనీలో 22 సీసీ కెమెరాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. "ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం" అని ఆమె అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని, ప్రతి కాలనీ, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.