ఈ నెల 14న ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం

NGKL: జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న నాగర్‌కర్నులుల్లో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ఆప్తాలామిక్ అధికారి శివారెడ్డి తెలిపారు. పట్టణంలోని రాంనగర్ కాలనీలో బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహించే కంటి ఆపరేషన్ శిబిరంలో రోగులకు కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. క్యాటరాక్ట్ పోరా కలిగిన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేస్తామన్నారు.