చింతలపూడిలో అంబేద్కర్‌కు ఘన నివాళి
ELR: చింతలపూడిలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే దేశ చరిత్రలో భారత రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉందని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని సూచించారు.