ఎస్సీ సబ్‌ప్లాన్ పనుల్లో అయోమయం
ADB: జిల్లాలో ఎస్సీ సబ్‌ప్లాన్ పనుల్లో అయోమయం నెలకొంది. నిధులు మంజూరై తొమ్మిది నెలలైనా పనులు ప్రారంభం కావడం లేదు. బిల్లులు రావనే భయం పనులు చేసేవారిని వెంటాడుతోందని ప్రచారం జరుగుతోంది. పనుల బాధ్యత పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. నిధులు ఫిబ్రవరిలోనే మంజూరు కాగా, కొన్నిచోట్ల మినహా ఎవరూ ముట్టుకోవడం లేదు.