రంగవల్లులతో ఆరడుగుల అంబేద్కర్ చిత్రం

NRPT: జిల్లా జాజాపూర్ జడ్పీ హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ కంగలి వెంకటేష్ ఏటా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రంగవల్లులతో ఆరడుగుల అంబేద్కర్ చిత్రాన్ని దాదాపు పది గంటల పాటు శ్రమించి చిత్రించాడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాను గీసిన చిత్రాన్ని అంబేద్కర్‌కు అంకితం చేసినట్టు తెలిపారు.