కొమరోలులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం
ప్రకాశం: కొమరోలు మండలంలోని పామూరు పల్లి గ్రామంలో మంగళవారం ఉద్యానవన శాఖ అధికారి శ్వేత ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరటి, బొప్పాయి పంటలో వచ్చే తెగులుకు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఉద్యానదన శాఖాధికారి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.