కొల్లిపరలో కాలువలోకి దూసుకెళ్లిన కారు

GNTR: కొల్లిపర మండలంలోని ఆదివారం తెల్లవారుజామున రేపల్లె కెనాల్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. పిడపర్తిపాలెం లాకుల వద్ద గొర్రెల కాపరులను తప్పించబోయి కారు కాలువలోకి పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన గొర్రెల కాపరులు కారులోని ఇద్దరు యువకులను రక్షించి, కొల్లిపర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు.