స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రయోజనం: ఎమ్మెల్యే
GNTR: గుంటూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం ప్రారంభించారు. 44వ డివిజన్‌లో ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు నగదు అందజేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.