ఈ నెల 23న రైతు భరోసాపై రైతులతో సమావేశం
గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 23న సోమవారం ఉదయం 10 గంటలకు రైతుల సమస్యలపై సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.