శ్రీశైలానికి పెరిగిన వరద.. మరో మూడు గేట్లు ఎత్తివేత

శ్రీశైలానికి పెరిగిన వరద.. మరో మూడు గేట్లు ఎత్తివేత

 NDL: శ్రీశైల జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో ఇవాళ ఉదయం మరో 2 గేట్లను ఎత్తివేశారు. ఉదయం ఏడు గంటల వరకు 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న అధికారులు వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మరో రెండు గేట్లు ఎత్తి మొత్తం 5 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా వరద కొనసాగితే మరికొన్ని గేట్లు ఎత్తి వేసే అవకాశం ఉంది.