బాధ్యత అందరిపై ఉంది: నర్సయ్య

SRCL: కార్మికుల హక్కులు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీపీఎం సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గన్నేరం నర్సయ్య అన్నారు. ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్‌లో మేడే సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధికి జీవనాధారమైన కార్మికులను గౌరవించడం నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు.