పన్నుల వసూళ్లపై దృష్టి: కమిషనర్

పన్నుల వసూళ్లపై దృష్టి: కమిషనర్

NGKL: ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అచ్చంపేట మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3.39 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.51 లక్షలు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల నుంచే దాదాపు రూ.58 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.