రోడ్డు విస్తరణ పనులు ఆపాలని మంత్రికి సీపీఎం వినతి
ఖమ్మం నగరంలోని సుందరయ్య నగర్ నుంచి ప్రకాష్ నగర్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వెంటనే నిలిపివేయాలని కోరుతూ సీపీఎం పార్టీ నాయకులు శనివారం మంత్రి నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రోడ్డు విస్తరణతో వేలాది మంది పేదలు ఇళ్లు కోల్పోతున్నారని అన్నారు. పేదల ఇళ్లు పోకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలన్నారు.