15న ఉమ్మడి జిల్లా నెట్ బాల్ సెలక్షన్స్
SRD: ఉమ్మడి మెదక్ జిల్లా అండర్-14,17 బాల, బాలికల 'నెట్ బాల్ ' సెలక్షన్ నిర్ధారిస్తున్నామని సిద్ధిపేట జిల్లా టి ఎస్జిఎఫ్ సెక్రటరీ సౌందర్య తెలిపారు. ఈనెల 15న ప్రజ్ఞాపూర్ జడ్పి బాలుర పాఠశాలలో సెలక్షన్ ఉంటాయన్నారు. విద్యార్థులు ఒరిజినల్, ఆధార్, ఫోన్ నైడ్ సర్టిఫికెట్ తో హాజరు కావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9963996911 ఫోన్ నంబర్ కు సంప్రదించాలన్నారు.