18 నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలి: సీఎం

18 నాటికి అన్ని కమిటీలు పూర్తి చేయాలి: సీఎం

AP: ఈ నెల 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా.. అన్ని కమిటీలు పూర్తి చేయాలని టీడీపీ నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. నామినేటెడ్ పదవులను త్వరలోనే భర్తీ చేస్తామని నేతలకు సీఎం హామీ ఇచ్చారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ మహానాడును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం విజయవంతానికి పార్టీ కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు.