VIDEO: ఋషికొండలో ఆకస్మిక వర్షం
విశాఖలోని ఋషికొండలో ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా కురిసిన వర్షం ఉపశమనం కలిగించింది. మంగళవారం మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం, సాయంత్రం ఆకస్మికంగా కురిసిన జల్లులతో ఉపశమనం పొందారు. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని వాతావరణం చల్లబడటంతో పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.