వ్యర్థాల నుంచి ఎగసిపడ్డ మంటలు

కృష్ణా: గన్నవరం మండలం తెంపల్లి శివారులోని పద్మజా లేబొరేటరీ వద్ద ఆదివారం వ్యర్థాల నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.