ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుంది: MLA
HYD: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎక్కువ నిధులు కేటాయిస్తూ, విద్యకు పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. ఫరఖ్‌నగర్‌లో ZPHS పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. HMDA నిధుల నుంచి మంజూరైన రూ. 40 లక్షలతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, మరమ్మత్తులను చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.