ధర్మవరంలో ఈనెల 16న వాహనాల వేలం

ధర్మవరంలో ఈనెల 16న వాహనాల వేలం

SS: ధర్మవరం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్‌లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను డిసెంబర్ 16న మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం వేయనున్నట్లు సీఐ చంద్రమణి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ.2000 టోకెన్ డబ్బులు చెల్లించి రసీదు తీసుకోవాలని సూచించారు. ఈ వేలంలో ఇండికా కారు, ద్విచక్ర వాహనాలు తదితర వాహనాలు అమ్మకానికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.