చాంద్రాయాణగుట్ట ఘటన.. ఇద్దరు వైద్యులు అరెస్ట్

చాంద్రాయాణగుట్ట ఘటన.. ఇద్దరు వైద్యులు అరెస్ట్

HYD: చాంద్రాయాణగుట్టలో ఈ నెల 3వ తేదీన మత్తు ఇంజెక్షన్లు తీసుకుని ఇద్దరు ఆటో డ్రైవర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రోగులకు ఇవ్వాల్సిన అనస్తీషియా ఇంజెక్షన్లను బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నట్లు సమాచారంతో డాక్టర్ జైపాల్ రెడ్డితోపాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.