వేసవిలో ఇలాంటి స్నాక్స్ అస్సలు తినకండి
HYD: వేసవి కాలంలో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అయితే, ఆ సమయంలో మంచి స్నాక్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. నూనెలో వేయించిన పదార్థాల కంటే శరీరాన్ని చల్లబరిచే స్నాక్స్ తీసుకోవడం మంచిది. మొలకలతో కూడిన పోషకాలు తీసుకోవడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. అలాగే, సమోసాలు, బజ్జీలు వంటివి మానేసి పుచ్చకాయ, కీరదోస లాంటి పండ్లు తినడం ఉత్తమం.