పలమనేరులో 'స్వానిధి సంకల్ప అభియాన్'
CTR: పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయమని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 'స్వానిధి సంకల్ప అభియాన్' పథకం ద్వారా 966 మంది వీధి విక్రయ దారులకు రూ. 2.28 కోట్ల చెక్కును, 9 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ. 66 వేల చెక్కును ఆయన పంపిణీ చేశారు.