శిథిలావస్థలో కేతగానిచెరువు గ్రామ సచివాలయం

శిథిలావస్థలో కేతగానిచెరువు గ్రామ సచివాలయం

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని కేతగానిచెరువు గ్రామ సచివాలయం భవనం శిథిలావస్థకు చేరుకుంది. సచివాలయం పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గోడలు చిట్లిపోవడం, పైకప్పు బలహీనపడటం వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామ సచివాలయ భవనాన్ని మరమ్మతులు చేయించాలని కోరారు.