నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
KMR: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. నామినేషన్ల దాఖలుకు శనివారం చివరి రోజు కావడంతో జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి పలు నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేలా చూడలని ఆదేశించారు.