రాంగ్ రూట్' అత్యంత ప్రమాదకరం: CP

రాంగ్ రూట్' అత్యంత ప్రమాదకరం: CP

KMM: రాంగ్ రూట్‌లో ప్రయాణం అత్యంత ప్రమాదకరమని, వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ హెచ్చరించారు. కొద్దిపాటి దూరం కోసం కూడా రాంగ్ రూట్‌‌ను ఆశ్రయించవద్దన్నారు. 'మీరు చేసే పొరపాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది' అని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. క్షేమంగా తమ గమ్యాన్ని చేరుకోవాలని ఆయన వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.