VIDEO: కర్రలను తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
MNCL: అనుమతి లేకుండా నీలగిరి కర్రలను తరలిస్తున్న బెల్లంపల్లి మండలం దుగినేపల్లి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను సోమవారం అటవీ అధికారులు సీజ్ చేశారు. కుష్ణపల్లి FRO దయాకర్ వివరాల ప్రకారం.. పంచాయతీ డ్రైవర్ రాజం గ్రామ చెత్తను పారబోసి తిరిగి వస్తూ అడవి నుంచి కర్రలను లోడ్ చేసుకున్నాడు. దీనిని గమనించిన అధికారులు ట్రాక్టర్‌ను పట్టుకుని రేంజ్ కార్యాలయానికి తరలించారు.