ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
GDWL: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మరోసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. నియోజకవర్గ శ్రేణులతో కలిసి గురువారం శ్రీరామ్ నగర్ ఎల్లారెడ్డి గూడ డివిజన్లో ఉప ఎన్నికల ప్రచారం ఆయన నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే తెలిపారు.