రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
MNCL: మంచిర్యాలలోని ఏసీసీ సిమెంట్ కంపెనీ సమీపంలో సోమవారం రాత్రి రైలు కింద పడి సాగె శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఇంటర్నెట్ షాప్ నిర్వహిస్తుండగా.. పెళ్ళై చాలా రోజులైనా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జస్పాల్ సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.