పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

VSP: నిరుపేద, ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు హిర నందిని ఫైనాన్షియల్ సర్వీసెస్ కృషి చేస్తోందని ఆ సంస్థ H.R మేనేజర్ అనీల్ తెలిపారు. గురువారం విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరువలోని ఒక హోటల్ వద్ద, 64 మంది లబ్ధిదారులకు మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. అనంతరం కుట్టు మిషన్లు, హాట్ బాక్స్‌లు, ఇడ్లీ పాత్రలు, తోపుడు బండ్లు, రుబ్బు మిషన్లు అందజేశారు.