'ఖైదీల పట్ల వివక్ష తగదు'

'ఖైదీల పట్ల వివక్ష తగదు'

విజయనగరం సబ్ జైలును జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ కృష్ణ ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. వీరికి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు గాని ఎటువంటి వివక్షత చూపించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌ను గూర్చి తెలిపారు.