గోపికి మే 8 వరకు రిమాండ్ పొడిగింపు

NTR: స్టోన్ క్రషర్ నిర్వాహకులను బెదిరించిన కేసులో అరెస్టై జైలులో ఉన్న విడదల గోపిని శుక్రవారం పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసులో వాదనలు విన్న విజయవాడ ACB కోర్టు గోపికి ఈ నెల 8 వరకు రిమాండ్ విధించింది. ఇటీవల అరెస్టైన గోపికి తొలుత విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో.. పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం మళ్లీ రిమాండ్ విధించింది.