గృహప్రవేశ వేడుకలలో పాల్గొన్న కలెక్టర్
కర్నూలు: గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కర్నూలులోని జోహారాపురంలో సోమవారం గృహప్రవేశ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ. జీ. భరత్, జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. లబ్ధిదారులైన నజీబున్నిస బేగం, షేక్ గౌస్ బాషాల నివాసాల్లో మంత్రి, కలెక్టర్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వారికి ప్రభుత్వం తరఫున కొత్త బట్టలను బహూకరించారు.